హై అలెర్ట్.. ఇప్పటి వరకూ ముగ్గురు మృతి

కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 72 ల్యాబ్ లలో కరోనా పరీక్షలు [more]

Update: 2020-03-17 12:59 GMT

కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 72 ల్యాబ్ లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ లో 250 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని, పాఠశాలలకు ఏప్రిల్ 2వ తేదీ వరకూ సెలవులు ప్రకటించారని తెలిపింది. కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్ లో ఇప్పటి వరకూ 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలిపింది.

Tags:    

Similar News