వేలానికి అంగారక శకలం.. ఎంత ధరంటే!!
కొనేవాళ్లు ఉండాలే కానీ వేలానికి ఎన్నో వస్తువులు వస్తూనే ఉంటాయి.
mars
కొనేవాళ్లు ఉండాలే కానీ వేలానికి ఎన్నో వస్తువులు వస్తూనే ఉంటాయి. తాజాగా భూమిపై ఉన్న అతిపెద్ద, అరుదైన అంగారక గ్రహ శకలం మార్టిన్ ఉల్క వేలానికి వెళ్లనుంది. ఈ శకలం సుమారు 25 కిలోల బరువు ఉంటుంది. ఇది 2023లో సహారా ఎడారిలో దొరికింది. అంగాకరక గ్రహం నుంచి భూమిపై ఇప్పటివరకూ పడ్డ ఇతర శకలాల కంటే దాదాపు 70% పెద్దది. మార్టిన్ ఉల్కలు ఆస్టరాయిడ్ మార్స్‌ను ఢీకొట్టడం వల్ల ఇది అంతరిక్షంలోకి వచ్చి ఉంటాయి. ఇది 225 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణించి చివరికి భూమికి చేరుకుంది. దీనిని న్యూయార్క్‌లోని సోతేబైస్‌లో జూలై 16న వేలం నిర్వహించనున్నారు. ఇది సుమారు 33.4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవచ్చని అంచనా వేస్తున్నారు.