గోదాలోకి కేకే

ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పదిరోజులుగా జరుగుతున్న సమ్మెలో ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్టీసీ కార్మికులకు విపక్షాలు, వివిధ సంఘాలు [more]

Update: 2019-10-14 11:56 GMT

ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పదిరోజులుగా జరుగుతున్న సమ్మెలో ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్టీసీ కార్మికులకు విపక్షాలు, వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు తనను ఎంతగానో భాదించాయన్నారు కేశవరావు. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపవన్నారు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ నాయకులు స్వాగతించారు. కేకే మధ్యవర్తిగా ఉంటే చర్చల్లో పాల్గొనడానికి సిద్ధమేనని వెల్లడించాయి. దీంతో ఢిల్లీ వెళ్లిన కేకే తిరుగు పయనమవుతున్నారు. కేకే వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపే అవకాశముంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే కేకే చర్చలకు రెడీ అవుతున్నారు.

 

Tags:    

Similar News