పవన్ పై టీడీపీ నేతల కీలక వ్యాఖ్యలు

తనకు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెబుతున్న టీడీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ తమ స్నేహితుడే అంటున్నారు. పవన్ కళ్యాణ్, [more]

Update: 2019-03-29 08:24 GMT

తనకు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెబుతున్న టీడీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ తమ స్నేహితుడే అంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసే ఉన్నారని, వారిద్దరికీ మధ్యలో కొంత దూరం పెరిగినా ఇప్పుడు మాత్రం ఒక అండర్ స్టాండింగ్ తోనే ఉన్నారని టీడీపీ నేత, రాష్ట్ర గిడ్గుల సంస్థ డైరెక్టర్ రమణబాబు చెప్పారు. టీడీపీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవాళ మరో టీడీపీ నేత, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ స్నేహితులేని ఆయన టీడీపీ కార్యకర్తలకు చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో వైరల్ అయ్యింది. తన ప్రచారంలో టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ కచ్చితంగా టీడీపీతో కుమ్మక్కయ్యారని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి టీడీపీని గెలిపించడమే పవన్ లక్ష్యమని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. తమకు రెండు పార్టీలూ సమాన దూరమని జనసేన నేతలు అంటున్నారు.

Tags:    

Similar News