ట్రేస్ చేయగలుగుతారా? ఫోన్ ఆధారంగానేనా?

మర్కజ్ , దేవ్ బంద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి ఇవే ప్రధాన [more]

Update: 2020-04-17 04:46 GMT

మర్కజ్ , దేవ్ బంద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి ఇవే ప్రధాన కారణం కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రార్థనలు ముగిసి 24 రోజులు గడుస్తుండటంతో సెకండరీ కాంట్రాక్టులపై దృష్టి పెట్టారు. మర్కజ్, దేవ్ బంద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అయితే కేసులు పెరుగుతుండటంతో సెకండరీ కాంటాక్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది తెలంగాణ పోలీసులకు సవాల్ గా మారిది. కాల్ లిస్ట్ ఆధారంగా ఇప్పటికే జాబితాను రూపొందించారు. ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్టు అయిన వారు ఫోన్ స్విచాఫ్ చేశారు. దీంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడకు వెళ్లి వచ్చిన వారు ఎవరు? వారితో ఎవరు కాంటాక్టు అయ్యారన్న విష‍యంపైనే ఇప్పుడు తెలంగాణ పోలీసు శాఖ సీరియస్ గా దృష్టి సారించింది.

Tags:    

Similar News