బ్రేకింగ్ : వైసీపీలోకి మరో టీడీపీ నేత

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో కొద్దిసేపటి క్రితం చేరారు. అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి [more]

Update: 2019-11-04 11:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో కొద్దిసేపటి క్రితం చేరారు. అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు కొంతకాలం క్రితం టీడీపీకి రాజీనామా చేశారు. అయితే ఆయనను వైసీపీలోకి చేర్చుకోవద్దంటూ కొందరు అడ్డుకున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే కొద్దిసేపటి క్రితం సన్యాసి పాత్రుడు తన భార్యతో కలసి వైసీపీలో చేరిపోయారు. సన్యాసిపాత్రుడు అనకాపల్లి మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేశారు.

Tags:    

Similar News