కియా ఇప్పుడే వెళ్లకపోయినప్పటికీ?

కియా ఇప్పుడు వెళ్లకపోవచ్చు, అలాగని ఉండకపోవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కియా పరిశ్రమకు ఇబ్బందు తలెత్తాయన్నారు. కియా పరిశ్రమను తీసుకురావడానికి [more]

Update: 2020-02-06 12:37 GMT

కియా ఇప్పుడు వెళ్లకపోవచ్చు, అలాగని ఉండకపోవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కియా పరిశ్రమకు ఇబ్బందు తలెత్తాయన్నారు. కియా పరిశ్రమను తీసుకురావడానికి మూడు రాష్ట్రాలు పోటీ పడినా తాను వెంటపడి మరీ రాష్ట్రానికి తెచ్చానని చంద్రబాబు తెలిపారు. వైసీపీ మంత్రులు, ఎంపీలు ఇలాగే వ్యవహరిస్తే ఎలాంటి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాబోదన్నారు. ఇప్పటికే లక్షా 80 వేల పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నేరప్రవృత్తి ఉన్న వారు నేతలుగా మారితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయన్నారు. రాయటర్స్ లాంటి వార్తా సంస్థ కియా తరలిపోతుందని కథనం ప్రచురించిందన్నారు. తమిళనాడు అధికారులు కూడా దీనిని ఖారు చేశారని చెప్పారు. అక్కడ నీళ్లు లేకపోయినా కియా పరిశ్రమ వచ్చిందంటే గత ప్రభుత్వం ఘనతేనని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News