Chennai : ఎవరూ గంటల పాటు బయటకు రావద్దు.. వార్నింగ్

తమిళనాడులకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. చెన్నై నగరంలో ఇప్పటికీ నీటిలోనే నానుతుంది. చెన్నై నగరంలోని అన్ని సబ్ వేలను మూసి వేశారు. దీంతో పాటు లోతట్టు [more]

Update: 2021-11-11 04:48 GMT

తమిళనాడులకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. చెన్నై నగరంలో ఇప్పటికీ నీటిలోనే నానుతుంది. చెన్నై నగరంలోని అన్ని సబ్ వేలను మూసి వేశారు. దీంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రత్యేక క్యాంప్ లలో ఉంచారు. ప్రజలు మరికొద్ది గంటల పాటు ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది.

వాయుగుండం ముప్పు….

చెన్నైకి 170 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉండటంతో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. నిన్న అత్యధికంగా తాంబరంలో 23 శాతం వర్షపాతం నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.

Tags:    

Similar News