సర్వే పై వేటు….!!!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధనుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలే చికాకు పుట్టిస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ పీసీీసీ చీఫ్ [more]

Update: 2019-01-06 11:54 GMT

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధనుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలే చికాకు పుట్టిస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ ఓటమికి ఉత్తమ్, కుంతియాలే కారణమని చెప్పారు. వీరి వైఖరి కారణంగానే పార్టీ ఓటమి పాలయిందని మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంపై సమీక్ష అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేపు మరిన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.

ఉత్తమ్, కుంతియాలపై….

దీంతో పార్టీ క్రమశిక్షణా సంఘం సర్వే సత్యనారాయణపై వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మొన్నటి ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉత్తమ్, కుంతియాలు తనపై కొందరితో దాడి చేయించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో సర్వేను సస్పెండ్ చేశారు.

Tags:    

Similar News