దగ్గుబాటి కారు బీభత్సం..!

Update: 2018-10-22 06:27 GMT

రాంగ్ రూట్ లో దూసుకువచ్చిన సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు ప్రమాదానికి కారణమైంది. సికింద్రాబాద్ లోని ఇంపీరీయల్ గార్డెన్ దగ్గర ఆదివారం రాత్రి దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో దూసుకువచ్చి ఓ బైక్ ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న సురేష్ చంద్ర, దుర్గాదేవి దంపతులతో పాటు మూడేళ్ల చిన్నారి సిద్ధేష్ కు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన దగ్గుబాటి సురేష్ పై కేసు నమోదు చేసి 41 ఏ కింద కార్ఖానా పోలీసులు నోటీసులు అందజేశారు. ప్రమాదం తర్వాత సురేష్ బాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.

Similar News