స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!

Update: 2018-09-06 07:35 GMT

స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కం నేరం కాదని చారిత్రక తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 377 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగరు సభ్యులతో కూడిన ధర్మాసం తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించలేమని, లైంగిక స్వభావం ఆధారంగా పక్షపాతం చూపించడమంటే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. గతంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించి జైలుశిక్ష కూడా విధించేలా చట్టం ఉండేది. అయితే, కొందరు స్వలింగ సంపర్కుల పక్షాన సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ‘స్వలింగ సంపర్కం’ తప్పుకాదని తీర్పు చెప్పింది.

Similar News