ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు విస్మయం

తుళ్లూరు మాజీ తహశీల్దార్ కేసును వారంలోగా తేల్చమని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మూడు వారాల తర్వాత విచారణ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. [more]

Update: 2020-10-01 08:30 GMT

తుళ్లూరు మాజీ తహశీల్దార్ కేసును వారంలోగా తేల్చమని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మూడు వారాల తర్వాత విచారణ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తుళ్లూరు భూకుంభకోణం లో మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు సహా పలువురి పై సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంలో కేసు ఏమిటని హైకోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుందని సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చట్టం తన పని తాను చేసుకునేలా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వచ్చే వారంలోగా ఈ కేసుపై విచారణ ముగించాలని సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టును ఆదేశించింది.

Tags:    

Similar News