చర్యలు తప్పేట్లు లేవే…??

మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి నివాసాలు, కార్యాలయాలపై రెండోరోజు సీబీఐ అధికారులు సోదాలు ప్రారంభించారు. నిన్న మొదలయిన సోదాలు రెండో రోజూ [more]

Update: 2019-06-02 07:41 GMT

మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి నివాసాలు, కార్యాలయాలపై రెండోరోజు సీబీఐ అధికారులు సోదాలు ప్రారంభించారు. నిన్న మొదలయిన సోదాలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేయడం, డొల్ల కంపెనీలను స్థాపించడం వంటి వాటిపై సీబీఐ ఆరా తీస్తుంది. నిన్న తనిఖీ చేసిన అధికారులు రాత్రి తాళాలు వేసి కార్యాలయాన్ని తమ అధీనంలోనే ఉంచుకున్నారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ పేరుతో బెంగళూరులో అనేక బ్యాంకుల నుంచి దాదాపు 360 కోట్ల రుణాలను తీసుకుని చెల్లించకపోవడంపై అక్కడ కేసు కూడా నమోదయింది. ఇప్పటికే సుజనా చౌదరికి సంబంధించిన కొన్ని ఆస్తులను జప్తు చేసిన సీబీఐ తదుపురి చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News