సుజనా చౌదరికి ఎయిర్ పోర్టులో చుక్కెదురు

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కి ఎయిర్ పోర్ట్ లో చుక్కెదురైంది. అమెరికా వెళ్లేందుకు చేసే ప్రయత్నాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాంకు ఫ్రాడ్ కేసులో లుక్ [more]

Update: 2020-11-13 12:36 GMT

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కి ఎయిర్ పోర్ట్ లో చుక్కెదురైంది. అమెరికా వెళ్లేందుకు చేసే ప్రయత్నాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాంకు ఫ్రాడ్ కేసులో లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున అమెరికా వెళ్లేందుకు వీలులేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పారు. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి సుజనా చౌదరి వెనుతిరిగాడు. అయితే తనను అధికారులు అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేస్తున్నారని తెలంగాణ హైకోర్టులో ఎంపీ సుజనాచౌదరి పిటిషన్ దాఖలు చేశారు. తన పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారని పిటిషన్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని వెల్లడించారు. అయితే తనను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో జరిగిన సంఘటనకు సంబంధించి లుక్ అవుట్ నోటీసులను పూర్తిగా కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికీ పలు కేసుల్లో ఎంపీ సుజనాచౌదరి పైన కేసులు నమోదయి ఉన్నాయి. ఈడి తో పాటు సి.బి.ఐ కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సుజనా చౌదరి పైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News