ఆసియా కప్ లంకదే

ఆసియా కప్ ను చివరకు శ్రీలంక చేజిక్కించుకుంది. ప్రారంభమయినప్పుడు తడబడిన జట్టు చివరకు కప్పును ఎగరేసుకుపోయింది

Update: 2022-09-12 02:20 GMT

ఆసియా కప్ ను చివరకు శ్రీలంక చేజిక్కించుకుంది. ప్రారంభమయినప్పుడు తడబడిన జట్టు చివరకు కప్పును ఎగరేసుకుపోయింది. పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో లంక బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని తమ వైపునకు తిప్పుకున్నారు. బ్యాటింగ్ లో రాజపక్స, హసరంగ, మదుషాన్ బౌలింగ్ తో పాకిస్థాన్ బౌలర్లకు, బ్యాటర్లకు చుక్కలు చూపించారు. తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. శ్రీలంక వరసగా వికెట్లు పడి పోవడంతో కనీసం వంద చేయడం కూడా కష్టమేనని అందరూ భావించిన తరుణంలో హసరంగ, రాజపక్స ఇన్నింగ్స్ తో ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్నే ముందుంచగలిగారు.

కుప్పకూల్చి....
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో హసరంగ 36, రాజపక్స 71 పరుగులు చేసి స్కోరును 170కు చేర్చారు. ఆసియా కప్ లో ఇదేమీ పెద్ద స్కోరేమీ కాకపోయినా పాకిస్థాన్ కు ఒకరమైన లక్ష్యాన్ని నిర్దేశించినట్లయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ లక్ష్య ఛేదనలో తడబడింది. 13 ఓవర్లకే 91 పరుగులు చేయగలిగింది. మదుషాన్ నాలుగు, హసరంగ మూడు వికెట్లు తీయడంతో పాక్ బ్యాటింగ్ ను కుప్పకూల్చారు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి పాక్ ను చిత్తుగా ఓడించగలిగింది. ఇరవై ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక కప్పును ఎగరేసుకుపోయింది.


Tags:    

Similar News