సోనూ సూద్ విలన్ కాదు అసలైన హీరో

సినీ నటుడు సోనూ సూద్ నిజజీవితంలో అసలైన హీరో అనిపించుకున్నారు. కరోనా సమయంలో ఆయన అనేక మందిని ఆదుకున్నారు. వలస కార్మికులను ఎందరినో తన సొంత ఖర్చుతో [more]

Update: 2020-07-26 14:41 GMT

సినీ నటుడు సోనూ సూద్ నిజజీవితంలో అసలైన హీరో అనిపించుకున్నారు. కరోనా సమయంలో ఆయన అనేక మందిని ఆదుకున్నారు. వలస కార్మికులను ఎందరినో తన సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. మీడియాలో వచ్చే కథనాలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే దీనగాధలకు సోనూ సూద్ వెంటనే స్పందిస్తున్నారు. ఏ రాష్ట్రమైనా సరే ఆయన సాయం చేయడంలో ముందుంటారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రైతు పేదరికం కారణంగా తన పొలంలో కుమార్తెల చేత అరక దున్నించారు. దీనికి స్పందించిన సోనూ సూద్ వెంటనే ఆ కుటుంబానికి ట్రాక్టర్ ను బహుకరించారు. టాలీవుడ్, బాలీవుడ్ లో ఎంత మంది హీరోలున్నా కష్ట కాలంలో స్పందిస్తున్న సోనూ సూద్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

Tags:    

Similar News