ఆ స్థాయి కాకాణికి లేదు

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండి పడ్డారు. నారాలోకేష్ పై కాకాణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. మత్స్యకార ప్యాకేజీకింద [more]

Update: 2021-04-20 00:43 GMT

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండి పడ్డారు. నారాలోకేష్ పై కాకాణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. మత్స్యకార ప్యాకేజీకింద 44 కోట్లు మంజూరు చేసింది నిజమేనని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితెలిపారు. మూడు విడతలుగా విడుదల చేస్తామని జీవోలో ఉందన్నారు. నిధుల విడుదల నిజమే అని, కాకాణి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవోలు కాకాణిలాగా నకిలీపత్రాలు కావన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో మత్స్యకారుల నిధుల పంపిణీని కాకాణి అడ్డుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నారా లోకేష్ ను విమర్శించే స్థాయి కాకాణికి లేదన్నారు.

Tags:    

Similar News