ఆ మరణాలకు ప్రభుత్వాలదే బాధ్యత

కరోనా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్ శైలజానాధ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉందని అన్నారు. [more]

Update: 2021-05-15 01:01 GMT

కరోనా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్ శైలజానాధ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉందని అన్నారు. కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని శైలజానాధ్ అన్నారు. ఏపీలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నా పడకల సంఖ్యను ప్రభుత్వం పెంచలేదని శైలజానాధ్ అన్నారు. సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపివేయడంపై ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి కూర్చుని పరిష్కారించాలన్నారు. ప్రయివేటు ఆసుపత్రులు కరోనా రోగులను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శైలజానాధ్ ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కృషి చేయాలని శైలజానాధ్ కోరారు.

Tags:    

Similar News