ఆర్టీసీ సమ్మె పై రేపు తుదినిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై రేపు సాయంత్రం తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ తమకు చేరిన తర్వాత దానిపై [more]

Update: 2019-11-18 14:00 GMT

ఆర్టీసీ సమ్మెపై రేపు సాయంత్రం తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ తమకు చేరిన తర్వాత దానిపై చర్చించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రేపు ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన రాస్తారోకో, సడక్ బంద్ లను వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి ఆమరణదీక్షను విరమించారు. రేపు యధాతధంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని చెప్పారు. హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై తాము ప్రభుత్వాన్ని ఆదేశించలేమని, కార్మిక న్యాయస్థానం రెండు వారాల్లోగా పరిష్కరించమని ఆదేశిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. సమ్మె విరమించాలని హైకోర్టు సూచించింది. దీనిపై రేపు ఆర్టీసీ సమ్మె పై జేఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది.

Tags:    

Similar News