రేవంత్ రెడ్డి అరెస్ట్ ఖాయమా?

Update: 2018-09-27 12:37 GMT

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇంటి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులతో పాటు ఈ దాడుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి డీఆర్ఐ అధికారులు కూడా అధికారులు చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించి మొత్తం పదిహేను చోట్ల దాడులు చేస్తున్నారు.

ఇంటివద్ద భారీ భద్రత.....

మనీల్యాండరింగ్ కు రేవంత్ రెడ్డి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను పెంచారు. రేవంత్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున ఆయన ఇంటికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డి కొండగల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. ఈ రాత్రికి రేవంత్ ను అరెస్ట్ చేసే అవకాశముందన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. రేవంత్ రెడ్డి కంపెనీలకు సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయల మేరకు లెక్కలు లేవన్నది ప్రధాన ఆరోపణ.

Similar News