రేవంత్ లాజిక్ ఇదే....!!

Update: 2018-11-22 12:36 GMT

కోటి ఉద్యోగాలు ఇస్తామంటే చంద్రబాబు అడ్డుకున్నారా? అమరవీరులకు సాయం చేస్తానంటే ఏపీ సీఎం అడ్డుకున్నారా? అని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సభల్లో చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు వచ్చే నీటిని చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటారని రేవంత్ ప్రశ్నించారు. దిగువ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణను నీటి విషయంలో అడ్డుకునే ప్రసక్తి లేదని చెప్పారు. ఓటమి భయంతోనే కేసీఆర్ చంద్రబాబు పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ చెప్పే మాయమాటలను ప్రజలు ఇక విశ్వసించే పరిస్థితి లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంద సీట్లు రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానన్న కేటీఆర్ 99 సీట్లు వస్తే ఎందుకు రాజకీయ సన్యాసం చేయలేదని ప్రశ్నించారు.

Similar News