రాయపాటికి బెదిరింపులు

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరొకసారి పత్రికల్లో కి ఎక్కారు. రాయపాటి పై ఉన్న సిబిఐ కేసులను మాఫీ చేస్తామంటూ ఇద్దరు వ్యక్తులు కాల్ చేసి డబ్బులు [more]

Update: 2020-01-19 02:18 GMT

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరొకసారి పత్రికల్లో కి ఎక్కారు. రాయపాటి పై ఉన్న సిబిఐ కేసులను మాఫీ చేస్తామంటూ ఇద్దరు వ్యక్తులు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. తమకు తాము సిబిఐ లోని సీనియర్ అధికారులుగా పరిచయం చేసుకుని రాయపాటికి ఫోన్ చేశారు. ఢిల్లీ సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నట్టుగా రాయపాటిని నమ్మించారు. ఢిల్లీ సిబిఐ ఆఫీస్ నుంచి కాల్ చేసినట్లుగా ల్యాండ్ లైన్ నెంబర్ నుంచి రాయపాటికి నేరుగా కాల్ చేశారు. ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి రాయపాటికి ఫోన్ రావడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. అయితే కేసులు మాఫీ చేస్తామంటూ చాలా మంది వ్యక్తులు తన చుట్టు తిరుగుతారని అనుమానం వచ్చింది. రాయపాటికి ఇద్దరు వ్యక్తులు పదేపదే కాల్ చేసి కేసులు మాఫీ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తాము అడిగినంత మొత్తంలో డబ్బులు ఇవ్వకపోతే కేసుల నుంచి బయటపడలేరని బెదిరించారు.

సీీబీఐ కార్యాలయం నుంచి….

దీంతో పాటు ఇద్దరు వ్యక్తులు గుంటూరు కి వెళ్ళి నేరుగా రాయపాటిని బెదిరించడం జరిగింది. ఈ వ్యవహారాలతో పూర్తిగా విసిగిపోయిన రాయపాటి సాంబశివరావు నేరుగా ఢిల్లీ కి వెళ్ళాడు. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం అధికారులను కలిశారు. తనకు ఢిల్లీ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, కేసులు మాఫీ చేస్తామని కొందరు నమ్మబలుకుతున్నారని, అలాంటి వ్యక్తులు తనను పదేపదే బెదిరిస్తున్నారని సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రాయపాటి చేసిన ఫిర్యాదుపై సిబిఐ అధికారులు వెంటనే స్పందించారు. ఇందుకు సంబంధించి నిఘా టీంను ఏర్పాటు చేశారు. ఇద్దరి పైన విచారణ ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన మణివర్ధన్ రెడ్డి తో పాటుగా మధురై చెందిన సెల్వం కలిసి రాయపాటిని బెదిరించినట్టు గా సీబీఐ విచారణలో బయట పడింది. దీంతో సీబీఐ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్ ,చెన్నైలలో దాడులు చేశారు . రెండు రోజులపాటు దాడులు చేసిన తర్వాత మణివర్ధన్ రెడ్డి తో పాటుగా సెల్వమణిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కూడా ఢిల్లీ సీబీఐ నుంచి మాట్లాడుతున్నట్టు గా ఒక స్నూపీ కాల్ ను చేస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో ఉన్న ల్యాండ్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. నిజంగానే సిబిఐ ఢిల్లీ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నట్లుగా నమ్మించే విధంగా ఇద్దరూ పూర్తి ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి టెక్నాలజీని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే మాదిరిగా చాలా మంది ప్రముఖులకు వీళ్ళు కాల్ చేసి ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన ట్లుగా సిబిఐ అధికారులు తేల్చారు.

Tags:    

Similar News