కోడ్ దాటారంటే.... రజత్ వార్నింగ్

Update: 2018-10-06 12:58 GMT

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రజత్ కుమార్ ఎన్నికల నిబంధనలు వెల్లడించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించవద్దని ఆయన స్పష్టం చేశారు.

- ప్రభుత్వ భవనాలపై ఉన్న కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లు 24 గంటల్లో తొలగిస్తాం. 48 గంటల్లో బహిరంగ ప్రదేశాల్లో తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.

- నేతలకు అధికారిక వాహనాల వినియోగం తక్షణమే రద్దు చేస్తున్నాం.

- ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు.

- అభివృద్ధి కార్యక్రమాలు 72 గంటల్లో ఆపేయాలి.

- నిబంధనల ఉల్లంఘన జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్, మొబైల్ టీమ్ ఏర్పాటు చేస్తాం.

- అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ అడ్వర్టయిజ్ మెంట్లు ఆపేయాలి.

- 32,574 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక పరిశీలన అధికారులను ఏర్పాటు చేస్తాం.

- రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎన్నికల ప్రచారం నిషేదం. ఈ సమయంలో ప్రచారం నిర్వహించరాదు.

- భారీ నగదు లావాదేవీలు, మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెడతాం.

- నవంబర్ 9 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం.

Similar News