బెంగళూరులో రజనీ

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్దం అయిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు. బెంగళూరు పెరిగి ఓ ఇంటి [more]

Update: 2020-12-07 13:14 GMT

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్దం అయిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు. బెంగళూరు పెరిగి ఓ ఇంటి వాడైన రజనీకాంత్ తరువాత చెన్నైలో అడుగుపెట్టి ఏకంగా సూపర్ స్టార్ అయిపోయారు. రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల పక్కా క్లారిటీ ఇచ్చిన తలైవా రజనీకాంత్ బెంగళూరు చేరుకుని సొంత సోదరుడు సత్యనారాయణ ఫ్యామిలీతో పాటు ఆయన సన్నిహితులతో మంతనాలు జరిపారు. బెంగళూరు రహస్యంగా వచ్చిన తలైవా మీడియాను దూరం పెట్టడం చర్చకు దారితీసింది.
రహస్యంగా వచ్చి….
సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. తమిళ సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఓ వెలుగు వెలుగుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సొంత సోదరుడు సత్యనారాయణ మాత్రం బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ కాక ముందు ఆయన్ను ఆయన సోదరుడు సత్యనారాయణ అన్ని రకాలుగా ఆదుకున్నారు. డిసెంబర్ 6వ తేదీ ఆదివారం రాత్రి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు చేరుకున్నారు. అనంతరం సన్నిహితుడి కారులో రజనీకాంత్ బెంగళూరులోని ఆయన సొంత సోదరుడు సత్యనారాయణ నివాసం ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. అనంతరం కుటుంబ విషయాలతో పాటు రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో రజనీకాంత్ ఆయన సోదరుడు సత్యనారాయణతో చర్చించారని తెలిసింది.

Tags:    

Similar News