తెలంగాణలో విజయం ప్రజాకూటమిదే...!

Update: 2018-11-28 11:29 GMT

తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో ఒక్క కుటుంబం ఒకవైపు ఉంటే.... మిగతా ప్రజలంతా ఒకవైపు ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో కచ్చితంగా ప్రజాకూటమి గెలుస్తుందని... గెలిచాక ప్రజల ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి సభలో రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

- తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు కేవలం తెలంగాణ భవిష్యత్ కోసమే కాదు దేశ భవిష్యత్ కోసం జరుగుతున్న పోరాటం.

- సీబీఐ, ఈడీ, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలను నరేంద్ర మోదీ నాశనం చేసుకుంటూ వస్తున్నారు.

- తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒకవైపు... రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకవైపు ఉన్నారు. తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో ప్రజా కూటమి గెలుపు తర్వాత దేశంలోనూ ఇదే కూటమి గెలుస్తొంది.

- మొదట తెలంగాణలో నరేంద్ర మోదీ బీ-టీంపై పోటీచేసి గెలిచాక ఢిల్లీలో ఏ-టీంని ఓడిద్దాం.

- ఓట్ల రద్దుకి, రాష్ట్రపతి ఎన్నికల్లో, అవిశ్వాస తీర్మాణం, జీఎస్టీ విషయాల్లో టీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీపై పోరాటం చేసింది.

- తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణకు, ఏపీకి కొన్ని హామీలు ఇచ్చాము. తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ప్రత్యేక రాయితీలు ఇస్తామని కేంద్రం హామీలు ఇచ్చింది. ఏపీకి కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ హామీలన్నీ నెరవేరుస్తాం.

- నరేంద్ర మోదీ ఏపీ, తెలంగాణకు ఇచ్చి హామీలు ఏమీ నెరవేర్చలేదు. కేసీఆర్ ఓవైపు నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తుంటే మరోవైపు నరేంద్ర మోదీ తెలంగాణకు మోసం చేస్తున్నారు.

- మద్దతు ధర అడిగినందుకు తెలంగాణలో రైతులపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. సరైన ధర ఇవ్వకుండానే రైతుల భూములు లాక్కుంటూ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాలా తయారైంది.

Similar News