మోదీ ప్రధాని కాదు

మోదీ ప్రధానిగా వ్యవహరించడం లేదని, కార్పొరేట్ సంస్థలకు ఉపకరణంలా మారారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వ ఆస్తులను లీజుకివ్వడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం [more]

Update: 2021-08-24 12:48 GMT

మోదీ ప్రధానిగా వ్యవహరించడం లేదని, కార్పొరేట్ సంస్థలకు ఉపకరణంలా మారారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వ ఆస్తులను లీజుకివ్వడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు రైల్వేలను కూడా ప్రయివేటీకరించే ప్రక్రియకు ఈ ప్రభుత్వం పూనుకోవడం విచారకరమని రాహుల్ గాంధీ అన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ప్రభుత్వ ఆస్తుల జోలికి వెళ్లలేదని రాహుల్ గుర్తు చేశారు. తాము మార్కెట్ షేర్ తక్కువగా ఉన్న సంస్థలనే ప్రయివేటీకరించామన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలను ప్రారంభించిందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కీలకమైన పరిశ్రమలను ప్రయివేటీకరించవద్దని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News