ఆరోగ్యంగానే ఉన్నా

తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను సినీనటుడు పోసాని కృష్ణమురళి ఖండించారు. కొందరు కావాలనే తన ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరిన మాట [more]

Update: 2019-07-31 12:30 GMT

తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను సినీనటుడు పోసాని కృష్ణమురళి ఖండించారు. కొందరు కావాలనే తన ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఇన్ఫెక్షన్ వల్లనే తాను ఆసుపత్రిలో చేరి చికిత్స పొందానని చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని పోసాని కృష్ణమురళి తెలిపారు. తన కంటే ఎక్కువ కష్టపడిన వారిగా భావించి కొందరికి పదవులు ఇచ్చి ఉండవచ్చునేమో అని ఆయన సెటైర్ వేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కొందరు సినీ పెద్దలకు ఇష్టం లేదని ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలను పోసాని ఖండించారు.

Tags:    

Similar News