ఆ పట్టుబడ్డ నగదు బీజేపీ నేతలదే

శామీర్ పేట్ లో పట్టుబడ్డ నగదు బిజెపి నేతలదేదని పోలీసులు స్పష్టం చేశారు… నిన్న రాత్రి 40 లక్షల రూపాయలు ఎస్వోటీ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు [more]

Update: 2020-10-06 13:31 GMT

శామీర్ పేట్ లో పట్టుబడ్డ నగదు బిజెపి నేతలదేదని పోలీసులు స్పష్టం చేశారు… నిన్న రాత్రి 40 లక్షల రూపాయలు ఎస్వోటీ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టుకున్నారు ..ఈ డబ్బు కు సంబంధించి సరైన ఆధారాలు చూపెట్టకపోవడంతో ఎస్ఓటీ అదికారులు, శామీర్ పేట్ పోలీసులకు అప్పగించారు. దీంతో నిన్నటి నుంచి ఈ డబ్బు పైన ఊహాగానాలు నడుస్తున్నాయి.. దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందన్న దానిపై క్లారిటీ వచ్చింది.. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కు డబ్బులు ఇచ్చేందుకు వెళుతున్నట్లుగా చెప్పారు. నిన్న రాత్రి ముగ్గురి దగ్గర నుంచి 40 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.. శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న సమయంలో పట్టుకున్నారు. ఈ డబ్బు మొత్తాన్ని కూడా బిజెపి అభ్యర్థికి చేర్చేందుకు వెళుతున్నట్లు తెలిపారు.. అయితే దీనికి సంబంధించి రఘునందన్ రావు పిఎ సంతోష్ మాట్లాడిన కాల్ రికార్డు డీటెయిల్స్ కూడా అధికారులు సేకరించారు.. పట్టుబడ్డ ముగ్గురు పలుమార్లు రఘునందరావు పీఏ తో మాట్లాడినట్టుగా తేలింది. ఈ కాల్ రికార్డు ఆధారంగా 40 లక్షల డబ్బు బిజెపి నాయకులకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని డి సి పి బాల నగర్ పద్మజ వెల్లడించారు.. అయితే ముగ్గురు పైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేశామని , అదే మాదిరిగా రఘునందన్ రావు పీఏ సంతోష్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News