రెమ్ డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్ దందాముఠా అరెస్ట్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ సంఖ్యలో రెమ్ డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు [more]

Update: 2021-05-11 01:19 GMT

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ సంఖ్యలో రెమ్ డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.. ఈ ముఠా నుండి 42 రెమ్ డెసివర్ ఇంజక్షన్లతో పాటు ఒక లక్ష 69 వేల రూపాయల నగదు, ఒక కారు, ఒక ద్వీచక్రవాహనం, ఐదు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత అధికంగా వుండటంతో పాటు, అత్యధిక వ్యాధిగ్రస్తులు వ్యాధి నివారణకు రెమ్ డెసివర్ ఇంజక్షన్ల వాడకం అధికం కావడంతో కొద్ది వ్యక్తులు ముఠాగా ఏర్పాడి హైదరాబాదు నుండి రెమ్ డెసివర్ ఇంజక్షన్ల ఎం.ఆర్.పి రేట్లకు కోనుగోలుచేసి వాటిని అత్యవసరం వున్న కరోనా వ్యాధిగ్రస్తులకు అధిక ధరలకు అందజేయడం జరుగుతోంది. ఇదే రీతిలో పోలీసులు అరెస్టు చేసిన నిందితులు శంషాబాద్ ప్రాంతం నుండి రెమ్ డెసివర్ ఇంజక్షన్ల కోనుగోలు చేసి వాటిని 28వేల రూపాయల చోప్పున అమ్మేందుకు సిద్దపడ్డారు.

Tags:    

Similar News