అసెంబ్లీలో చర్చించే మూడు రాజధానులపై

మూడు రాజధానుల ప్రతిపాదన మంచిదేనని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో రాయలసీమలో పుట్టి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారంతా హైదరాబాద్ ను అభివృద్ధి చేశారే తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ [more]

Update: 2020-01-01 12:44 GMT

మూడు రాజధానుల ప్రతిపాదన మంచిదేనని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో రాయలసీమలో పుట్టి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారంతా హైదరాబాద్ ను అభివృద్ధి చేశారే తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ చేయలేదన్నారు. మరి కొద్దిరోజుల్లోనే కమిటీ నివేదిక అందుతుందని, అది కూడా ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. హైపవర్ కమిటీ 20 రోజుల్లో నివేదిక ఇస్తుందని, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతనే మూడు రాజధానుల పై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాయలసీమ వాసులంతా జగన్ కు ధన్యవాదాలు చెప్పాలన్నారు. ఏపీ రాజధానితో కేవలం పదిశాతం మంది ప్రజలకే పనులు ఉంటాయని చెప్పారు. అలాగే కోర్టుల విషయంలో కూడా అంతేనన్నారు.

Tags:    

Similar News