ఇసక వేస్తే “ర్యాలీ”నంత మంది

విశాఖపట్నంలో జనసేన లాంగ్ మార్చ్ కు జనం పోటెత్తారు. మద్దెల పాలెం నుంచి ప్రారంభమయిన ర్యాలీ రెండు గంటల్లో సభాస్థలికి చేరుకోవాల్సి ఉండగా దాదాపు నాలుగు గంటల [more]

Update: 2019-11-03 12:11 GMT

విశాఖపట్నంలో జనసేన లాంగ్ మార్చ్ కు జనం పోటెత్తారు. మద్దెల పాలెం నుంచి ప్రారంభమయిన ర్యాలీ రెండు గంటల్లో సభాస్థలికి చేరుకోవాల్సి ఉండగా దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొనడటంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ లాంగ్ మార్చ్ లో భవన నిర్మాణ కార్మికులు కూడా పాల్గొన్నారు. అయితే సభాస్థలి వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు వేదిక పైకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కరెంట్ షాక్ తగిలింది. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్ లో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సభలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. జగన్ కంటే విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చోడు బాగా పరిపాలిస్తారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. ఇసుక కోసం ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

Tags:    

Similar News