Pawan : చెన్నై పోలీసు అధికారికి పవన్ ప్రశంసలు

చెన్నై పోలీస్ ఇన్ స్పెక్టర్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఆమెను ప్రశంసిస్తూ పవన్ ట్వీట్ చేశారు. చెన్నైలో వరదలు సంభవించిన సమయంలో [more]

Update: 2021-11-12 04:48 GMT

చెన్నై పోలీస్ ఇన్ స్పెక్టర్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఆమెను ప్రశంసిస్తూ పవన్ ట్వీట్ చేశారు. చెన్నైలో వరదలు సంభవించిన సమయంలో చెన్నై లోని ఎస్ఐ రాజేశ్వరి చేసిన సేవలను పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఆమె చేసిన సేవలను పవన్ కల్యాణ్ కొనియాడారు.

అచేతనంగా పడి ఉన్న….

గత కొద్ది రోజులుగా చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చెన్నై టీపీ ఛత్రం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పనిచేస్తున్న రాజేశ్వరి తన విధుల్లో భాగంగా తన పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫుట్ పాత్ పై అచేతనంగా పడి ఉన్న వ్యక్తిని చూశారు. మురికిగా ఉన్న అతనిని తరలించేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాజేశ్వరి స్వయంగా తన భుజాలమీద మోసుకుని ఆటో వరకూ తీసుకెళ్లి ఆసుపత్రికి తరలించారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఆమె చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Tags:    

Similar News