నేటి ఐక్యత... పటేల్ శ్రమ ఫలితమే

Update: 2018-10-31 06:11 GMT

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నూతన భారతదేశానికి ప్రతినిధిగా ఉంటుందని, దేశ సమ్రగతను, ఓ వ్యక్తి దార్శనికతను ప్రపంచానికి చాటుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున 182 అడుగుల పటేల్ భారీ విగ్రహాన్ని మోదీ ఇవాళ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పటేల్ విగ్రహావిష్కరణ కార్య్రకమం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ రోజును ఏ భారతీయుడు మరిచిపోలేడని పేర్కొన్నారు. దేశ సమగ్రతకు కృషి చేసిన పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. ఇవాళ భారత్ ఐక్యంగా ఉందంటే అది పటేల్ శ్రమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తదితరులు పాల్గొన్నారు.

Similar News