చిలుక చేష్టలకు టెక్నాలజీ తోడైతే...

Update: 2018-12-17 13:25 GMT

పిల్లి దూరంగా ఉంటే ఎలుక నాకేం భయం అన్నట్లు ఆడుకుంటుంది కదా.. అలానే ఉన్నాయి ఈ చిలుక చేసే పనులు. వివరాల్లోకెళ్తే... యూకేలోని ఆక్స్ ఫోర్డ్ షైర్ ప్రాంతానికి చెందిన మారియన్ విస్చ్సూస్కీ అనే మహిళ స్థానకంగా ఉండే ఓ జూలో పనిచేస్తుంది. అయితే, అక్కడి నుంచి ఆమె ఓ ఆఫ్రికన్ జాతి చిలుకను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఈ చిలుక మిమక్రీ చేయడంలో దిట్ట. వాస్తవానికి, ఇది మాట్లాడే తప్పుడు మాటలు పర్యాటకులను ఇబ్బంది పెడతాయని భావించిన జూ సిబ్బంది దానిని వదుకోవాలనుకున్నారు.

అమెజాన్ లో ఆర్డర్....

అప్పుడు మారియన్ దానిని ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఓ రోజు మారియన్ డ్యూటీకి వెళ్లగా చిలుక ఏకంగా అమెజాన్ అలెక్సా(మాటల ద్వారా కావాల్సిన పని చేసిపెట్టే పరికరం)ను ఉపయోగించుకుని ఈ-కామర్స్ సైట్ లో కొన్ని వస్తువులు ఆర్డర్ చేసేసింది. మారియన్ ఇంటికి వచ్చాక విషయం తెలుసుకుని అవాక్కయింది. చిలుకకు ఇష్టమైన కర్భూజ పండ్లు, ఎండు ద్రాక్షలతో పాటు ఓ బల్బు, గాలిపటాన్ని కూడా ఆర్డర్ చేసింది. దీంతో మారియన్ వాటన్నింటినీ కాన్సిల్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి టక్నాలజీకి, చిలుక తెలివి జత కలవడంతో పెద్ద విచిత్రమే జరిగింది.

Similar News