బ్రేకింగ్ : పరిపూర్ణానంద నగర బహిష్కరణ

Update: 2018-07-11 01:52 GMT

పరిపూర్ణనంద స్వామిజీని హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ చేశారు .రెచ్చగొట్టే ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, అందువల్ల స్వామిజీని నగర బహిష్కరణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం రెండు రోజులుగా పరిపూర్ణానందస్వామి గృహనిర్బంధంలో ఉన్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని మరో ప్రాంతానికి పోలీసులు తరలించారు. గత ఏడాది నవంబర్ లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో స్వామీజీ చేసిన ప్రసంగంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరణ చేస్తున్నట్లు పోలీసులు స్వామీజికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఎక్కడికి తరలిస్తున్నారు అనే సమాచారం లేదు. జూబ్లీహిల్స్ లో ఉన్న పరిపూర్ణానంద స్వామిజీ ఇంటికొచ్చిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, పోలీసులు భారీగా చేరుకుని స్వామీజీని అక్కడి నుంచి తరలించారు. స్వామీజీని ఎక్కడికి తరలిస్తున్నారో స్పష్టం చేయలేదు. నవంబర్ 1, 2017, డిసెంబర్ 2, 2017 లో రాష్ట్రీయ హిందూ సేనకు సంబంధించిన సమావేశంలో స్వామీజీ కొన్ని వ్యాఖ్యలు చేశారని, స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ చేశామని పోలీసులు చెబుతున్నారు.

Similar News