కేదార్ నాధ్ తెరుచుకుంది ...!

Update: 2018-04-30 01:44 GMT

ద్వాదశ జ్యోతిరిలింగాల్లో ఒకటైన కేదారనాధ్ ఆలయం ఆరునెలల తరువాత తిరిగి తెరిచారు. ఆలయాన్ని పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. గతానికన్నా భిన్నంగా ఈసారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. కొండవాలు ప్రాంతాల్లో సౌకర్యాలను అధికం చేసింది. ప్రతి కిలోమీటర్ కు ఒక వైద్యుడు ఉండేలా, తాగునీరు ఇతర ఆహార పదార్ధాలను అందుబాటులో పెట్టింది. ఇక కేదార్ నాధ్ లో పరమేశ్వరుడిపై ఒక లేజర్ షో ఏర్పాటు చేసింది.

సోమవారం బద్రీనాధ్ ...

హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రలో ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి తెరుచుకున్నాయి. ఇక బద్రీనాధ్ ఆలయం సోమవారం నుంచి తెరుచుకోనుంది. గౌరీ కుండ్ నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేపట్టింది. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా యంత్రాంగం ఈసారి ప్రత్యేక కార్యాచరణ ద్వారా సమస్యలు అధిగమించేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన చార్ ధామ్ యాత్ర లో పాల్గొనేందుకు వేలాదిగా భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్ బాట పట్టారు.

Similar News