బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుతున్న కేసులు.. రెండువేలకు లోపు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా కేసులు రెండు వేలకు లోపు ఉంటున్నాయి. తాజాగా తెలంగాణలో 1,897 కరోనా పాజిటివ్ [more]

Update: 2020-08-12 03:29 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా కేసులు రెండు వేలకు లోపు ఉంటున్నాయి. తాజాగా తెలంగాణలో 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,544కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా బారిన పడి 654 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 22596 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని తెలంగాణలో 61,294 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 479 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News