ఎన్నికలు సజావుగా నిర్వహిస్తాం.. అందరూ సహకరించాల్సిందే

ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా మంత్రులు తనపై వ్యాఖ్యలు [more]

Update: 2021-01-27 12:51 GMT

ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా మంత్రులు తనపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటే వారికి ఆగ్రహం కల్గిందని, 3.96 లక్షల మంది యువత ఓటు హక్కును కోల్పోవడానికి కారణమెవరని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. గతాన్ని అందరూ మరిచిపోయి సమన్వయంతో పనిచేసి ఎన్నికలు నిర్వహించుకుందామన్నారు. గవర్నర్ ను కలిసి ఎస్ఈసీ గౌరవించేలా చర్యలు తీసుకోవాలని కోరారరన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. తన ఇల్లు దుగ్గిరాలలో ఉన్నా తనకు ఓటు హక్కు కల్పింలచలేదని చెప్పారు. తనకు మనసులో ఎటువంటి అభిప్రాయం లేదని, తనపై బురద జల్లడం మానుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. ఎన్నికలు ఏకగ్రీవంపై ప్రకటనలు ఇవ్వడం సరికాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఐఆండ్ పీఆర్ కమిషనర్ ను తాను సంజాయిషీ కోరారని చెప్పారు.

Tags:    

Similar News