బ్రేకింగ్ : నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే నిరాకరణ

రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కొద్ది సేపటి క్రితం నిమ్మగడ్డ కేసులో వాదనలు ప్రారంభమయ్యాయి. హైకోర్టు తీర్పుపై [more]

Update: 2020-06-10 07:22 GMT

రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కొద్ది సేపటి క్రితం నిమ్మగడ్డ కేసులో వాదనలు ప్రారంభమయ్యాయి. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేంుదకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిమ్మగడ్డ కేసులో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ప్రతివాదులకు సమయం ఇచ్చింది. నిమ్మగడ్డ కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, న్యాయమూర్తులు బోపన్న, హృషికేశ్ రాయ్ లు ఈ విచారణ చేపట్టారు. హైకోర్టు తీర్పుపై తాము స్టే ఇవ్వలేమని చెప్పింది. రాజ్యాంగ సంస్థలపైన ఆటలు తగవని సున్నితంగా సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Tags:    

Similar News