నిమ్మగడ్డ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

హైకోర్టు ధర్మాసనం మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలిగింపు పిటీషన్ పై తీర్పు ను రిజర్వ్ చేసింది. ఇటు పిటీషనర్ల వాదనలను, అటు ప్రభుత్వ [more]

Update: 2020-05-08 12:32 GMT

హైకోర్టు ధర్మాసనం మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలిగింపు పిటీషన్ పై తీర్పు ను రిజర్వ్ చేసింది. ఇటు పిటీషనర్ల వాదనలను, అటు ప్రభుత్వ వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటీషన్ పై విచారణ ముగిసినట్లేనని భావించవచ్చు. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ తాము నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించలేదని, ఆర్డినెన్స్ ను మాత్రమే తెచ్చామని చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా ఆర్డినెన్స్ ను తెచ్చామన్నారు. ఈ వాదనను పిటీషనర్ల తరుపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కక్ష పూరితంగానే తొలగించారని పిటీషనర్ తరుపున న్యాయవాదులు పేర్కొన్నారు. తీర్పు ఎప్పడైనా వెల్లడించే అవకాశముంది.

Tags:    

Similar News