నాలుగురోజులైనా నిమ్మగడ్డ ప్రసాద్…?

పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ పై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయనను సెర్బియా పోలీసులు అదుపులోనే ఉంచుకుని విచారణ చేస్తోంది. ఈరోజు సీబీఐ కోర్టుకు నిమ్మగడ్డ [more]

Update: 2019-08-02 11:39 GMT

పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ పై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయనను సెర్బియా పోలీసులు అదుపులోనే ఉంచుకుని విచారణ చేస్తోంది. ఈరోజు సీబీఐ కోర్టుకు నిమ్మగడ్డ ప్రసాద్ హాజరుకావాల్సి ఉంది. కానీ తాను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అందువల్లే తాను సీబీఐ కోర్టుకు హాజరుకాలేకపోతున్నానని, తాను సెర్బియా వెళుతున్నట్లు సీబీఐకి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ కోర్టు కి ఇచ్చిన పిటిషన్ లో పేర్కొన్నారు. తనను అక్రమంగా నిర్భంధించారని నిమ్మగడ్డ ప్రసాద్ పిటీషన్ లో పేర్కొన్నారు. వాన్ పిక్ కేసులో రసల్ ఖైమా సంస్థ ఫిర్యాదు మేరకు బెల్ గ్రేడ్ లో నాలుగు రోజుల క్రితం నిమ్మగడ్డ ప్రసాద్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ పిటీషన్ ను సీబీఐ కోర్టు నమోదు చేసుకుంది. ఇంటర్ పోల్ పోలీసులు రసల్ ఖైమాకు తరలిస్తారా? లేక భారత్ కు తీసుకువస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News