చంద్రబాబు దీక్ష కు వెల్లువెత్తుతున్న మద్దతు

విభజన హామీల సాధనకు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు జాతీయ నేతలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ [more]

Update: 2019-02-11 06:48 GMT

విభజన హామీల సాధనకు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు జాతీయ నేతలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ నేత ములాయం సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు. ఏపీ నుంచి వివిధ ప్రజా, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతు తెలిపారు. ఇక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడి సంఘీభావం తెలిపారు. దీక్షకు వచ్చిన నేతలంతా చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News