మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం

నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాను తక్కువ ధరకు ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందిస్తారు. [more]

Update: 2021-02-28 01:06 GMT

నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాను తక్కువ ధరకు ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందిస్తారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా టీకా ధర కేవలం రూ.250లుగా నిర్ణయించింది. దీనికి వందరూపాయలు అదనంగా సర్వీస్ ఛార్జి తీసుకోవచ్చు. మార్చి 1వ తేదీ నుంచి అరవై ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ను అందించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఈ ధరలను ఖరారు చేసింది. అన్ని రాష్ట్రాలూ ఈ మార్గదర్శక సూత్రాలను అనుసరించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News