నరేంద్ర మోడీ ఆస్తులు ఎంతో తెలుసా..?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ లో ప్రధాని తన [more]

Update: 2019-04-26 13:40 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ లో ప్రధాని తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం రూ.2.51 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా ప్రధాని పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్థుల విలువ రూ.1.10 కోట్లు కాగా, చరాస్థి రూ.1.41 కోట్లగా చూపించారు. తనకు వేతనం, సేవింగ్స్ పై వస్తున్న వడ్డీ మాత్రమే ఆదాయం అని మోడీ పేర్కొన్నారు. తన చేతిలో మార్చి 31 నాటికి రూ.38,750 నగదు, రూ.4,143 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించారు. ఇక ఎస్బీఐలో రూ.1.27 కోట్ల ఫిక్స్ డ్ డిజాపిట్లు ఉన్నట్లు చెప్పారు. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని మోడీ అఫిడవిట్ లో పేర్కొన్నారు. తాను గుజరాత్ యునివర్సిటీ నుంచి పీజీ చేసినట్లుగా నరేంద్ర మోడీ తెలిపారు.

Tags:    

Similar News