చంద్రబాబుకు అటా ఆహ్వానం

Update: 2018-05-11 08:32 GMT

అమెరికన్ తెలుగు కన్వెన్షన్ కు హాజరుకావాలని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఈ మేరకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ వాసిరెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధులు శుక్రవారం ఉదయం అమరావతిలో చంద్రబాబును కలిశారు. మే 31, జూన్ 1, 2 తేదీల్లో అమెరికాలో తెలుగు కన్వెన్షన్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయనకు తెలిపారు. ఈ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని వారు కోరారు. ఈ సందర్భంగా తెలుగువారి కోసం అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న సేవలను చంద్రబాబు ప్రశంసించారు. చంద్రబాబుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులను సైతం అటా బృందం కలిసి సమావేశాలకు ఆహ్వానించింది.

Similar News