మున్సిపల్ ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలపై తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారణ నేటికి వాయిదా పడింది. [more]

Update: 2021-03-08 00:40 GMT

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలపై తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారణ నేటికి వాయిదా పడింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18 డివిజన్లలో ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించేలా చేశారని పిటీషన్ వేశారు. ఈ ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈరోజు దీనిపై హైకోర్టులో విచారణకు రానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని హైకోర్టు కోరింది.

Tags:    

Similar News