మీరా రోడ్డు గ్యాంగ్ పనే అది

ముంబైలోని మీరా రోడ్డు గ్యాంగ్ ఇప్పుడు హైదరాబాద్ ను టార్గెట్ చేసింది.. ఫిషింగ్ మెయిల్స్ నకిలీ సిమ్ కార్డు తో బ్యాంకు అకౌంట్లను కొల్లగొడుతున్న మీరా రోడ్డు [more]

Update: 2021-01-22 04:42 GMT

ముంబైలోని మీరా రోడ్డు గ్యాంగ్ ఇప్పుడు హైదరాబాద్ ను టార్గెట్ చేసింది.. ఫిషింగ్ మెయిల్స్ నకిలీ సిమ్ కార్డు తో బ్యాంకు అకౌంట్లను కొల్లగొడుతున్న మీరా రోడ్డు లోని గ్యాంగ్ ను సైబర్ బాద్ , సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిషింగ్ మెయిల్స్ తో ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టినటుగా పోలీసుల విచారణలో బయట పడింది. ఇందుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ముంబైలోని మీరా రోడ్డు లో ఉన్న గ్యాంగ్ చేస్తున్న ఆగడాలను చూసి పోలీసులు సైతం విస్తుపోతున్నారు. ముఖ్యంగా వీకెండ్ ను టార్గెట్ చేసుకొని వీళ్లు దొంగతనం పాల్పడుతున్న అధికారుల విచారణలో బయట పడింది. వీకెండ్ ను టార్గెట్ చేసి .. ఫిషింగ్ మెయిల్స్ తో మాయ చేస్తారు .. వివిధ సంస్థల ఆర్థిక లావాదేవీలు చేస్తున్న ఫోన్ నెంబర్లను టార్గెట్ గా చేస్తారు ఆపై మొబైల్ సిమ్‌ను బ్లాక్ చేస్తారు. అదే సిమ్‌ను ఫేక్ డాక్యూమెంట్లతో యాక్టివ్ చేస్తారు. అలా ఆ నెంబర్‌కు లింకప్ అయిన అకౌంట్ల నుంచి డబ్బులను స్వాహా చేస్తారు. ఇలా దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టిది ముంబై కి చెందిన మిరారోడ్డు గ్యాంగ్ .. ఈ గ్యాంగ్ పై ఆరు నెలలుగా సైబరాబాద్ పోలీసులు రెక్కీ చేసి ఎట్టకేలకు వీరి ఆగడాలకు కళ్లెం వేశారు.

Tags:    

Similar News