బాబు అంటే ఇష్టం.. ఆయన నటన అంటే కాదు..!

చంద్రబాబును నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులే ఇవ్వని చంద్రబాబు యువతకు ఉద్యోగాలు ఏమిస్తారని నటుడు మోహన్ బాబు ప్రశ్నంచారు. విద్యార్థులకు [more]

Update: 2019-03-22 08:18 GMT

చంద్రబాబును నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులే ఇవ్వని చంద్రబాబు యువతకు ఉద్యోగాలు ఏమిస్తారని నటుడు మోహన్ బాబు ప్రశ్నంచారు. విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించడం లేనందున ఆయన శుక్రవారం విద్యార్థులతో కలిసి తిరుపతిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… చంద్రబాబు అంటే తనకు ఇష్టమని కానీ చంద్రబాబు నాటకాలంటే మాత్రం తనకు ఇష్టంలేదన్నారు. చంద్రబాబుకు నటన బాగా వచ్చని, అది నమ్మే అమాయక ప్రజలు మోసపోయారన్నారు. మళ్లీ ఆయనను నమ్ముతారో లేదో ప్రజలకే తెలియాలన్నారు.

అంత అహంకారం ఎందుకు బాబూ…?

వైఎస్ ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి మంచి పథకాలు తెచ్చారని, ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ఇతర పనులకు మల్లిస్తున్నారని ఆరోపించారు. పసుపు – కుంకుమ కార్యక్రమం చంద్రబాబుకు ఎన్నికలకు మూడు నెలల ముందే గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. బకాయిలు చెల్లించాలని చంద్రబాబుకు తాను ఉత్తరం రాస్తే సమాధానం ఇవ్వలేదన్నారు. అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలోనే ఆయనకే సభ్యత్వం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కాలం ఎల్లవేళలా మనది కాదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇప్పటికీ బకాయిలు ఇవ్వకపోతే కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News