బ్రేకింగ్: వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మోహన్ బాబు

ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా [more]

Update: 2019-03-26 07:43 GMT

ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎలాంటి పదవి ఆశించకుండా వైసీపీలో చేరానని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి వల్లె తెలుగు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పడుతుందన్నారు. మూడేళ్లుగా చంద్రబాబుకు అనేకసార్లు ఫోన్ చేసి ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం అడిగానన్నారు. అయినా స్పందించకపోవడంతో ఉత్తరాలు రాశానన్నారు. ఇప్పుడు చంద్రబాబు తమ విద్యాసంస్థలపైనే ఆరోపణలు చేయిస్తున్నారని, గతంలో చంద్రబాబే తమ విద్యాసంస్థలను ప్రశంసించారన్నారు.

Tags:    

Similar News