ఇమ్రాన్ ఖాన్ కు కైఫ్ అదిరిపోయే కౌంటర్

మైనారిటీలను ఎలా చూసుకోవాలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చూపిస్తామంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్లే వస్తున్నాయి. నిన్న ఎంఐఎం అధినేత అసదుద్దిన్ [more]

Update: 2018-12-25 11:07 GMT

మైనారిటీలను ఎలా చూసుకోవాలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చూపిస్తామంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్లే వస్తున్నాయి. నిన్న ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ… ఇమ్రాన్ ఖాన్ పై మండిపడ్డ విషయం తెలిసిందే. తాజాగా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్… ఇమ్రాన్ కి ఘాటు కౌంటర్ ఇచ్చారు. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్ లో 20 శాతం మంది మైనారిటీలు ఉన్నారని, మరి ఇప్పుడు కేవలం 2 శాతమే ఉన్నారని పేర్కొన్నారు. అదే సమయంలో భారత్ లో స్వాతంత్రం తర్వాత మైనారిటీల జనాభా పెరిగిందన్నారు. మైనారిటీలను ఎలా చూడాలో ఇతర దేశాలకు చెప్పే స్థాయిలో పాకిస్తాన్ లేదని కైఫ్ ధీటుగా బదులిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Tags:    

Similar News